మీరు బ్యాంక్ ట్రాన్సక్షన్స్ ఎక్కువ చేస్తున్నారా | Income Tax Returns 2025-26 | Market Nazar

Income Tax Returns 2025-26

Income Tax Returns 2025-26!

మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంటు లో ఎక్కువ మొత్తంలో  Cash Withdraw చేస్తున్నారా ?

అయితే మీకు TDS (Tax Deducted at Sources) కటింగ్ తప్పదు……?

ఏంటి ఈ TDS ? Bank Account లో Cash Withdraw లిమిట్ ఎంత?

ఎంత వరకు Transaction చేస్తే Tax పడుతుంది?

Income Tax Returns 2025-26

ప్రస్తుతం PAN , Aadhaar & Bank Account ఒక దానికి ఒకటి link అయి ఉన్నందున మీరు చేసే ప్రతి Transaction (Bank Transaction, Share Trading, Real Estate Transactions) ప్రతిదీ Income Tax Department వారి నిఘా ఉండడం జరుగుతుంది.

అందుకే మీ యొక్క Income Tax Returns సమర్పించే ముందు అన్నీ Transactions సంబందించి అన్నీ విషయాలను మీ యొక్క Income టాక్స్ రిటర్న్స్ లో చూపించి దానికి సంబందించి టాక్స్ లను కట్టేయడం మంచిది.  

ప్రధాన మంత్రి ముద్ర యోజన

మీరు Income Tax Returns లో Transactions లను చూపించకుండా దాచిన లేదా మీరు Income టాక్స్ Returns ఫైల్ చేయక పోయిన మీకు Income Tax Department వారి నుంచి Notice వస్తుంది. అప్పుడు భారీగా Tax & Penalties Pay చేయవలసి వస్తుంది.

Income Tax Act, 1961 ప్రకారం సెక్షన్ 194N – నగదు withdraw పై TDS

భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ నల్లధనాన్ని నియంత్రించేందుకు, పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలను తగ్గించేందుకు, ఆదాయపు పన్ను చట్టం 1961లో సెక్షన్ 194Nని 2019 బడ్జెట్లో ప్రవేశపెట్టింది. ఇది 1 సెప్టెంబర్ 2019 నుండి అమలులోకి వచ్చింది.

Income Tax Returns 2025-26

1.సెక్షన్ 194N అంటే ఏమిటి?

ఈ సెక్షన్ ప్రకారం, ఒక వ్యక్తి బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ నుండి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షలు లేదా రూ. 1 కోటి కంటే ఎక్కువ నగదు withdraw చేస్తే, ఆ మొత్తం మీద TDS (Tax Deducted at Source) విధించబడుతుంది.

2.ఎవరికెవరికి వర్తిస్తుంది?

ఈ సెక్షన్ Individuals , Partnership Firms, కంపెనీలు, ట్రస్టులు, HUF, మొదలైన అన్నివిధాలా పాన్ ఉన్న ఖాతాదారులకు వర్తిస్తుంది.

అయితే ఈ Bank Transaction limits అనేది ప్రతి సంవత్సరం Income Tax Returns file చేసిన వారికి ఒక విధంగా, file చేయని వారికి ఒక విధంగా ఉంటాయి.

3.TDS రేట్లు (TDS Rates):

(a) గత 3 సంవత్సరాలలో ITR ఫైల్ చేసినవారు:

  • రూ. 1 కోటి వరకు: TDS లేదు
  • రూ. 1 కోటి దాటి నగదు తీసుకుంటే: 2% TDS

(b) గత 3 సంవత్సరాలలో ITR ఫైల్ చేయని వారు:

  • రూ. 20 లక్షల వరకు: TDS లేదు
  • రూ. 20 లక్షలు – రూ. 1 కోటి మధ్య: 2% TDS
  • రూ. 1 కోటి పైగా: 5% TDS

4. ఉదాహరణలు:

ఉదాహరణ 1 (ITR ఫైల్ చేసినవారు):

రమేష్ అనే వ్యక్తి 2024-25 ఆర్థిక సంవత్సరంలో తన ఖాతా నుండి మొత్తంగా రూ. 1.2 కోట్లు నగదు ఉపసంహరించాడు. ఆయన గత 3 సంవత్సరాలలో ITR ఫైల్ చేశారు.

  • మొదటి రూ. 1 కోటి వరకు: TDS లేదు
  • మిగిలిన రూ. 20 లక్షలపై: 2% TDS
  •  TDS = ₹20,00,000 x 2% = ₹40,000

ఉదాహరణ 2 (ITR ఫైల్ చేయని వారు):

Income Tax Returns 2025-26

సుమన్ అనే వ్యక్తి గత 3 సంవత్సరాలలో ITR ఫైల్ చేయలేదు. ఆయన 2024-25లో రూ. 70 లక్షలు నగదు ఉపసంహరించారు.

  • మొదటి రూ. 20 లక్షల వరకు: TDS లేదు
  • మిగిలిన రూ. 50 లక్షలపై: 2% TDS
  • TDS = ₹50,00,000 x 2% = ₹1,00,000

ఉదాహరణ 3 (ITR ఫైల్ చేయని వారు, రూ. 1 కోటి దాటి):

అనిల్ అనే వ్యక్తి ITR ఫైల్ చేయలేదు. రూ. 1.3 కోట్లు నగదు తీసుకున్నాడు.

  • రూ. 20 లక్షలు – 1 కోటి వరకు (₹80 లక్షలు): 2% = ₹1,60,000
  • రూ. 1 కోటి పైగా ₹30 లక్షలు: 5% = ₹1,50,000
  • మొత్తం TDS = ₹1,60,000 + ₹1,50,000 = ₹3,10,000

Income Tax Returns 2025-26

భారతదేశంలో డిఫెన్స్ స్టాక్స్ అంటే ఏమిటి

5. మినహాయింపులు (Exceptions):

ఈ సెక్షన్ కొన్ని వ్యక్తులకు వర్తించదు:

  • కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ శాఖలు
  • బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు
  • కొంతమంది రైతు సహకార సంఘాలు
  • బిజినెస్ అవసరాల కోసం నగదు ట్రాన్సాక్షన్ చేసే ATM లలోకి నగదు వెళ్ళిన సందర్భాలు

ఈ సెక్షన్ ఉద్దేశం:

  • డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం
  • నల్లధనాన్ని అడ్డుకోవడం
  • పెద్ద మొత్తంలో నగదు వినియోగాన్ని తగ్గించడం

సెక్షన్ 194N అనేది పన్ను విధానంలో నగదు చెలామణిని పర్యవేక్షించేందుకు తీసుకున్న ముఖ్యమైన చర్య. ఇది ప్రతి పెద్ద లావాదేవీలు చేసే వ్యక్తికి తెలిసి ఉండాల్సిన విషయం.

ఇతర ముఖ్య విషయాలు :

చట్టం యొక్క మూల ఉద్దేశ్యం (Legislative Intent):

  • అధిక మొత్తంలో నగదు తీసుకోవడం చాలా సందర్భాల్లో అక్రమ నాణ్యాన్ని (నల్లధనం) ఉత్పత్తి చేసే అవకాశముంది.
  • దీనిని నియంత్రించడానికి 2019 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ సెక్షన్‌ను ప్రవేశపెట్టింది.
  • డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కూడా ప్రధాన లక్ష్యం.

CBDT ఈ సెక్షన్‌పై అనేక సందర్భాల్లో స్పష్టత ఇచ్చింది. ముఖ్యమైనవి:

  • Notification_70_2019, dated 20-09-2019- ఇందులో కొన్ని మినహాయింపులు & విధానాలు వివరించబడ్డాయి.
  • Notification No. 80/2019, dated 15-10-2019-గ్రామీణ ప్రాంత బ్యాంకులు, సహకార సంఘాలకు ఇచ్చిన ప్రత్యేక మినహాయింపులు.
  • Circular No. 18/2019, dated 19-12-2019-చట్టాన్ని అమలు చేసే విధానం, బ్యాంకులకు సూచనలు. 

మరిన్ని సమాచారం కోసం :

Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *